హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.. 97 మందిపై కేసులు

HYD: సైబరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వీకెండ్ స్పెషల్ డ్రంక్‌ అండ్ అండ్‌ డ్రైవ్‌లో 97 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో 76 మంది ద్విచక్ర వాహనదారులు, 5 ఆటోలు, 15 కార్లు, ఒక హెవీ వాహనదారుడు ఉన్నారు. నిందితులను చట్టపరంగా కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు.