హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్నిమాపక కేంద్ర భవనాన్ని ప్రారంభించిన మంత్రి

AKP: సబ్బవరంలో రూ.1.60 కోట్లతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్ర భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ప్రారంభించారు. అనంతరం అగ్నిమాపక వాహనం, పరికరాలను పరిశీలించారు. విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారని మంత్రి అభినందించారు. పెందుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.