SKLM: పాతపట్నం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రెన్యువల్ కాని మూడు A4 మద్యం షాపులకు లాటరీ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ కె. కృష్ణారావు ఆదివారం తెలిపారు. పాతపట్నంలో SKL/92, సారవకోటలో SKL/94, SKL/95 షాపులు ఉన్నాయన్నారు. దరఖాస్తులకు అక్టోబర్ 1 వరకు గడువు ఉందన్నారు. అక్టోబర్ 5న శ్రీకాకుళంలో కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం షాపుల లాటరీ: ఎక్సైజ్ CI


