హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీనియర్ సివిల్ జడ్జి నివాస భవనానికి శంకుస్థాపన

ప్రకాశం: మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆరవ అదనపు జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో సీనియర్ సివిల్ జడ్జి నివాస భవన నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, ఆలపాటి గిరిధర్, వై. లక్ష్మణరావు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి సత్యానంద్, ఆరవ అదనపు జిల్లా జడ్జి దుర్గాభవాని, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.