హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్నికల సంఘం వ్యవహారాలపై రేపు కాంగ్రెస్ ర్యాలీ

MHBD: కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారాలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కొత్తగూడ మండల అధ్యక్షుడు బానోత్ రూపుసింగ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.