హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శిథిలావస్థకు చేరిన పురాతన ఆలయం

E.G: సీతానగరం మండలం జాలమూడిలోని వెయ్యేళ్ల చరిత్ర కలిగిన నరసింహస్వామి ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఆలయంలోని నరసింహస్వామి విగ్రహాన్ని కొత్తగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠించారు. అయితే పురాతన ఆలయ కట్టడం మాత్రం కాలక్రమేణా దెబ్బతిని శిథిలావస్థకు చేరుకుంది. ఈ పురాతన కట్టడాన్ని అధికారులు గుర్తించి సంరక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.