హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాఫ్ మారథాన్‌లో పెద్దవాల్గొట్ యువకుడి ప్రతిభ

NZB: కరీంనగర్‌లో ఆదివారం నిర్వహించిన మారథాన్‌లో సిరికొండ మండలం పెద్దవాల్గొట్ గ్రామానికి చెందిన కొలిప్యాక్ శ్రవణ్ గౌడ్ పాల్గొని ఆకట్టుకున్నారు. 21.32 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 6 నిమిషాల్లో పూర్తి చేశారు. కిలోమీటర్‌కు 5.55 నిమిషాల సగటు వేగంతో పరుగెత్తి తన అత్యుత్తమ హాఫ్ మారథాన్‌లో విజయం సాధించారు. శ్రావణ్ గౌడ్ ను గ్రామస్తులు అభినందించారు.