హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువకుడి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్

JGL: కుటుంబ కలహాలతో దొంగలమర్రి చెక్‌పోస్ట్ వద్ద పురుగుల మందు తాగిన శంకర్రావుపేట వాసి వంశీ(23)ని బ్లూకోట్స్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కాపాడారు. 112 సమాచారంతో వెంటనే అక్కడికి వెళ్లి రక్షించి, కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణం నిలిపిన కానిస్టేబుల్‌ను జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.