W.G: ప్రసిద్ధిగాంచిన పెనుమంట్ర (M) నత్తా రామేశ్వర స్వామి ఆలయం జలదిగ్బంధంలోనే కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో గోస్తనీ డ్రైన్ ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా ముంచెత్తింది. గత నాలుగు రోజులుగా ఆలయ ప్రాంగణాలు నీటిలోనే మునిగి ఉన్నాయి. భక్తులు స్వామి దర్శనానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
జలదిగ్బంధంలోనే నత్తా రామేశ్వర స్వామి ఆలయం


