హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాల కులంకు న్యాయం చేయాలని మంత్రికి వినతి

KMR: రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి మాల నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. అయ్యాల సంతోష్ మాట్లాడుతూ.. SC వర్గీకరణలో మాలలకు కేటాయించిన రోస్టర్ పాయింట్ 22 వల్ల విద్యా, ఉద్యోగాల్లో నష్టం జరుగుతోందన్నారు. రోస్టర్ పాయింట్ 12 లోపు ఉండేలా చూడాలని కోరారు. రిజర్వేషన్‌ 5 శాతం నుంచి 8 శాతానికి పెంచి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు.