హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామదేవతల కొలుపుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

BPT: వేమూరు నియోజకవర్గంలో ఆదివారం గ్రామదేవతల కొలుపుల కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. భట్టిప్రోలు(M) ఓలేరులో ఓలేటమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమృతలూరు(M) బోడపాడులో అంకమ్మ తల్లి కొలుపుల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు.