కృష్ణా: మచిలీపట్నం నుంచి పేడా లోడుతో ఏలూరుపాడు వెళ్తున్న లారీ ముందు చక్రం ఒక్కసారిగా పేలిపోవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను వెంటనే మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


