NGKL: పెద్దకొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల గ్రామంలో మురుగు నీరు రోడ్లపైనే పారుతుండటంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండ్ల మధ్య మురుగు నీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగి వ్యాధులు వ్యాపిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
పెద్ద కార్పాములలో రోడ్లపైనే మురుగు నీరు


