హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి భేటీ

SS: కదిరిలోని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి స్వగృహంలో ఆదివారం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యకర్తలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక పరిస్థితులు, ఎదురవుతున్న సమస్యలపై వారితో ప్రత్యేకంగా చర్చించారు. కార్యకర్తలు సైతం తమ అభిప్రాయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.