హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భాధిత కుటుంబాలను పరామర్శించిన అనూష

VZM: మెరకముడిదాం మండలం బుదరాయవలస గ్రామంలో నిన్న సాయంత్రం కోనేటిలో మునిగి మృతి చెందిన ముగ్గురు చిన్నారుల కుటుంబాలను వైసీపీ భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త బొత్స అనూష ఈరోజు పరామర్శించారు. చిన్నారుల మృతితో తీవ్ర విషాదంలో ఉన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. చిన్న వయసులోనే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.