హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు గురజాల నియోజకవర్గ వైసీపీ విస్తృత సమావేశం'

పల్నాడు: రేపు ఉదయం 10 గంటలకు పిడుగురాళ్ల భవనాశి ఫంక్షన్ హాల్లో గురజాల నియోజకవర్గ వైసీపీ విస్తృత సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి తెలిపారు. సమావేశానికి రాజ్యసభ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, జిల్లా వైసీపీ నాయకులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు హాజరు కావాలన్నారు.