హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలి: MLA

HNK: పట్టణంలోని కలెక్టరేట్‌లో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా MLA నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హాజరై, బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు. MLA మాట్లాడుతూ.. ప్రజల కోసం, బీసీల అభ్యున్నతి కోసం బాపూజీ చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను కొనసాగించాలని అన్నారు.