హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆగి ఉన్న లారీని ఢీకొని యువకుడికి గాయాలు

WGL: జిల్లా అండర్ బ్రిడ్జి శివనగర్లో ఆదివారం ఉదయం ప్రమాదం జరిగింది. రహదారి పక్కన ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొనడంతో కొండపటేల్ కాలనీకి చెందిన చందు తీవ్రంగా గాయపడ్డాడు. వీధి దీపాలు లేక చీకట్లో లారీ కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. 108 ఈఎంటీ కర్ణాకర్, పైలెట్ సాంబయ్య ప్రథమ చికిత్స అందించి MGMకు తరలించారు.