హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

MDK: జిల్లా పోలీస్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జిల్లా డీఎస్పీ ప్రసన్న కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమన్నారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆయన అలుపెరగని పోరాటం చేశారన్నారు.