MDK: రామాయంపేట మండల కేంద్రంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు మద్దెల రమేష్ ఆధ్వర్యంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధనలో ఆయన చేసిన పోరాటాలను నాయకులు స్మరించుకున్నారు. వేడుకల్లో బీసీ సంఘం డెవలప్‌మెంట్ ఆఫీసర్ కుంభం ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
రామాయంపేటలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు


