హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అరిష్టం కాదు.. వన్యజీవిని కాపాడండి: రహీం భాయ్

BHPL: భూపాలపల్లి పట్టణంలోని కార్మిక కాలనీలో ఇర్నాల జానీ ఇంట్లోకి ఆదివారం ఉడుము రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న జంతు సంరక్షకుడు సయ్యద్ రహీం భాయ్ అక్కడికి చేరుకుని ఉడుమును ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకున్నారు. ఇంట్లోకి ఉడుము వస్తే అరిష్టమనే అపోహ మాత్రమేనని, వన్యప్రాణులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన తెలిపారు.