హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పర్యాటక అభివృద్ధితో ఏపీకి ప్రత్యేక గుర్తింపు'

నంద్యాల: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ప్రకృతి సంపదను ప్రపంచానికి చాటేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఏపీని దేశ, విదేశీ పర్యాటకులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.