SS: నల్లచెరువు మండలం రాగాన్నగారిపల్లిలో అంగన్వాడీ కార్యకర్త సుమతిపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. విధులకు వెళ్తున్న ఆమెపై కారం పొడి చల్లి నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. ఆమె కేకలు విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై మగ్బూల్‌బాషా సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కారం చల్లి బంగారు గొలుసు చోరీ


