హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాధితులకు ఆర్థిక సాయం'

VSP: భారీ వర్షాల వల్ల మధురవాడ కొమ్మాది జంక్షన్, కార్పెంటర్ కాలనీలో మెట్ట రాము, కాంచన దంపతుల రేకుల షెడ్డు కూలిపోయింది. నిలువ నీడ లేక ఇబ్బంది పడుతున్న ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదివారం కళింగ సామాజిక వర్గ నాయకులు పరామర్శించి, రూ.1 లక్ష తక్షణ ఆర్థిక సాయం అందించారు. కళింగ కార్పొరేషన్ చైర్మన్ రొనంకి కృష్ణం నాయుడు, డైరెక్టర్ మామిడి దుర్గారావు పాల్గొన్నారు.