అన్నమయ్య: కలికిరి మండలం గుండ్లూరు పంచాయతీలో కేవీకే శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. బొప్పాయిలో వేరుకుళ్లు, వరి పంటలో కంకినల్లి, మామిడిలో కొమ్మఎండు, టమాటాలో సూది పురుగు సమస్యలను గుర్తించారు. మంజుల ఆధ్వర్యంలో చేపట్టిన పరిశీలనలో ఆయా తెగుళ్ల నివారణకు సిఫార్సు చేసిన మందులను వినియోగించాలని, పంటల సంరక్షణలో తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పంటల సంరక్షణపై రైతులకు సూచనలు


