హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు బాపట్లలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

బాపట్ల: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు గత అర్జీల పరిష్కారంపై అధికారులతో సమీక్ష ఉంటుంది. 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. పరిష్కారం కాని ఫిర్యాదుల వివరాలకు 1100కు కాల్‌ చేయవచ్చని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.