E.G: సీతానగరం మండలంలో ఆదివారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్సై ఎల్. శ్రీనివాస్ నాయక్ సూచించారు. ఊరేగింపుల్లో మద్యం సేవించి అల్లరి చేయడం, అశ్లీల నృత్యాలు ప్రదర్శించడం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులకు, భద్రతా సిబ్బందికి భక్తులు సహకరించి నిబంధనలు పాటించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'నిమజ్జనాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలి'


