హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

ATP: అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. అర్జీదారులు పాత రసీదులతో హాజరై వినతులు అందజేయాలన్నారు. పరిష్కారం కాని ఫిర్యాదుల వివరాల కోసం టోల్ ఫ్రీ 1100 నంబర్‌తో పాటు వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు.