హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐసీడీఎస్ సేవలపై కలెక్టర్ ఆనంద్ సమీక్ష

ATP: అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఐసీడీఎస్ శాఖపై జిల్లా కలెక్టర్ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రోస్టర్ సమర్పించని సీడీపీవోలకు ఛార్జ్ మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. కంబదూరు ప్రాజెక్టులో ఎస్ఎన్పీ పంపిణీ వెనుకబడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు ప్రీ-స్కూల్ హాజరు మెరుగుపరచాలని పేర్కొన్నారు.