హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫేక్ కాల్స్‌ను నమ్మవద్దు: వైసీపీ

ప్రకాశం: కనిగిరి వైసీపీ కార్యాలయ ప్రతినిధి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. పార్టీ సెంట్రల్ కార్యాలయం పేరుతో నాయకులు, కార్యకర్తలకు ఫోన్ చేసి స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ పరిస్థితిపై వివరాలు అడుగుతున్నారని తెలిపారు. ఈ కాల్స్‌కు పార్టీతో సంబంధం లేదని, ఫేక్ కాల్స్‌గా గుర్తించినట్లు పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని , వివరాలు తెలపవద్దన్నారు.