హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు

పల్నాడు: నకరికల్లు మండలం కండ్లగుంట శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది. అర్చకులు చవాలా శ్రీను నేతృత్వంలో అమ్మవారికి శ్రాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.