హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం!

కోనసీమ: అమలాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ సమీపంలోని సర్కులర్ బజార్ పక్కన ఉన్న గీతాస్ రెస్టారెంట్‌‌లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్‌‌లోని సామగ్రి మంటలకు ఆహుతయ్యాయి. గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.