హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్షల్ ఆర్ట్స్‌తో ఉజ్వల భవిష్యత్తు: సీఐ

అన్నమయ్య: రాజంపేట మార్షల్ ఆర్ట్స్ సాధనతో ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందడంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని రూరల్ సీఐ లింగప్ప అన్నారు. ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జీఎంసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు.