అన్నమయ్య: మదనపల్లె చంద్రకాలనీలోని భవానీనగర్ సమీప బైపాస్ రోడ్డు పక్కన ఆదివారం పుర్రె, ఎముకలతో కూడిన మృతదేహ అవశేషాలు బయటపడ్డాయి. దీంతో స్థానికంగా కలకలం రేగింది. వ్యక్తిని హత్య చేసి పాతిపెట్టారా లేక ఇతర కారణాలతో అవశేషాలు అక్కడికి చేరాయా అనే కోణాల్లో మదనపల్లె రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవశేషాలను పరిశీలించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
భవానీనగర్‌లో మృతదేహ అవశేషాలు కలకలం


