హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భార్యతో గొడవపడి.. భర్త ఆత్మహత్య!

AKP: పెదజాలరిపేట బాపూజీనగర్‌లో జిత్తాడ సతీశ్ (34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి 2 గంటల సమయంలో భార్యతో గొడవ అనంతరం ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో బీట్‌ కానిస్టేబుళ్లు సర్దార్, సురేశ్ అక్కడికి చేరుకున్నారు. సతీశ్ ఉరికి వేలాడుతూ కనిపించడంతో స్థానికుల సహాయంతో కిందకు దించి కేజీహెచ్‌కు తరలించారు.