హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ బిల్లుల చెల్లింపులకు డిజిటల్ బాట..!

NRML: విద్యుత్తు బిల్లుల చెల్లింపుల కోసం ఈఆర్వో కేంద్రాల ఎదుట వరుసలో నిలబడి నిరీక్షించే ఇబ్బందులను దూరం చేసేందుకు టీజీఎన్పీడీసీఎల్ డిజిటల్ చెల్లింపు విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సులభంగా, వేగవంతంగా చెల్లించే వెసులు బాటు కల్పించారు. దీంతో డిజిటల్ చెల్లింపులు చేస్తున్న విద్యుత్తు వినియోగదారుల సంఖ్య ఏటా పెరుగుతోంది. రెండేళ్లలో వారి సంఖ్య పదిశాతం పెరిగింది.