KMR: దోమకొండ మండల కేంద్రంలో ఈ నెల 29న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి కరాటే పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. అండర్-14 ,17 విభాగాలలో బాల బాలికలకు కరాటే పోటీలు ఉంటాయన్నారు. దోమకొండలోని ముదిరాజ్ కళ్యాణ మండపంలో పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ
ఈనెల 29న దోమకొండలో కరాటే పోటీలు


