హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు

NGKL: కల్వకుర్తిలోని తిరుపతి ఫ్లై ఓవర్ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జడ్చర్ల వైపు నుంచి కల్వకుర్తి వైపు కారులో వస్తున్న మార్చాల గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న మోటార్ సైకిల్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.