హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్ స్టేషన్ నిర్మాణ స్థలం పరిశీలన

NGKL: అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలోని పురుగులగుట్ట సమీపంలో నూతనంగా నిర్మించనున్న సబ్ స్టేషన్ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదివారం పరిశీలించారు. సబ్ స్టేషన్ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.