బాపట్ల: మండలం నందిరాజుతోట జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను కారు ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
బైక్-కారు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు


