హైదరాబాద్: 28°C
క్రీడలు

బాక్సింగ్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయం

భారత బాక్సర్‌ అంకుష్‌ పంఘల్‌ అదరగొట్టాడు. దీంతో ఆసియా క్రీడల్లో దేశానికి తొలి బాక్సింగ్‌ పతకం ఖాయమైంది. పురుషుల 80కేజీల క్వార్టర్‌ ఫైనల్‌లో తజకిస్థాన్‌కు చెందిన నెక్రుజ్‌ను 5-0 తేడాతో అంకుష్‌ చిత్తుగా ఓడించి సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. గత నెలలో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ అంకుష్‌ స్వర్ణం గెలిచాడు.