హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్‌ రూపంలో వారికి ప్రమాదం​ పొంచి ఉంది..!

టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీపై మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరో ఆరు నెలల్లోనే సూర్యవంశీ భారత టీ20 జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. అదే జరిగితే తిలక్‌ వర్మ లేదా శివమ్‌ దూబేలో ఒకరు తుది జట్టులో చోటు కోల్పోవాల్సి వస్తుందని చెప్పాడు.