GNTR: తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. శనివారం రాత్రి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గరుడ వాహనంపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహించారు. శనివారం, పౌర్ణమి కలిసి రావడంతో స్వామివారి గరుడ సేవను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది.
వార్తలు
తెనాలిలో వైభవంగా శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ


