హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఈ గ్రామాల్లో కరెంట్ కోత

SRD: సంగారెడ్డి మండల పరిధిలోని 9 గ్రామాల్లో, పట్టణంలోని పలు ప్రాంతాల్లో  ఆదివారం  ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ ప్రశాంత్ తెలిపారు. కంది మండల కేంద్రంలోని 132కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాపారులు, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.