హైదరాబాద్: 28°C
తెలంగాణ

చీటీల పేరిట భారీ మోసం

HYD: నగరంలో చీటీల వ్యాపారం పేరుతో భారీ మోసం జరిగింది. కూకట్‌పల్లి సమీపంలోని అడ్డగుట్టలోని HM హిల్స్ వాసి రమణరెడ్డి, ఆయన భార్య, కుమార్తెతో కలిసి చిట్‌ఫండ్ వ్యాపారం నిర్వహించేవారు. ముగ్గురు కలిసి 44 మంది దగ్గర రూ.16 కోట్ల మేర వసూలు చేసి పత్తా లేకుండా పోయారు. దీంతో బాధితులు మోసపోయినట్లు గ్రహించి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.