హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో వృధాగా పోతున్న త్రాగునీరు

ప్రకాశం: గిద్దలూరు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ప్రధాన పైపైలైన్ వద్ద వాల్ నుంచి తాగునీరు వృథాగా పోతోంది. పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొని ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో నీరు వృథా కావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టి నీటి వృథాను నివారించాలని కోరుతున్నారు. ప్రతి నీటి బొట్టునూ సంరక్షించాలని సూచిస్తున్నారు.