CTR: జిల్లాలోని పాఠశాలల్లో ఈనెల 29న జరిగే పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. మొత్తం 1705 ప్రాథమిక, 40 ప్రాథమికోన్నత, 335 ఉన్నత, 11 ఎయిడెడ్ పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలు రాలేదని స్పష్టం చేశారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలపై అభ్యంతరాలు లేవు


