హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అదనపు కట్నం వేధింపులపై కేసు

గుంటూరు: తెనాలి నందులపేటకు చెందిన లక్ష్మీ తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు ఆమె భర్త శ్రీనివాసరావుపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహం జరిగి 15 ఏళ్లు అవుతున్నా, అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త రోజూ మద్యం సేవించి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.