హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరాలోపు పీఆర్‌సీ ప్రకటించాలి: మహ్మద్ సాధిఖ్

MBNR: ప్రభుత్వ ఉద్యోగులకు దసరాలోపు కొత్త వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ప్రకటించాలని బీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ డిమాండ్ చేశారు. ఈ నెల 30తో పీఆర్‌సీ గడువు ముగియనున్నందున ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, బకాయి డీఏలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.