హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ప్రాజెక్టుల సాధన సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర

NGKL: డిండి ప్రాజెక్టును రద్దు చేసి, పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ జిల్లా ప్రాజెక్టుల సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర చేపట్టారు. వంగూరు మండలం ఉల్పర గ్రామం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రను ప్రొఫెసర్ హరగోపాల్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల రైతులు, ప్రజాసంఘాల నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు.